కే కోటపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం

459చూసినవారు
కే కోటపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కొట్టాన ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వారిచే రామాలయం నందు మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు చేసి పలు సూచనలు తెలియజేశారు. ఈ శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్