గెదలబంధలో వర్షం చెమలో పిల్లల చదువులు

681చూసినవారు
గెదలబంధలో వర్షం చెమలో పిల్లల చదువులు
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడా మండలం తూతంగి పంచాయతీ గెదలబంధ లోని గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల విద్యాకమిటి చైర్మన్ తాంగుల రాజ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయుడు అప్పలస్వామి గారితో సందర్శించారు. అందులో కొన్ని ప్రాథమిక సమస్యలు గుర్తించటం జరిగింది. గతంలో ఎస్ ఎస్ ఏ నిధులతో 2010-2011 సంవత్సరంలో దాదాపుగా 4 లక్షలు రూపాయలతో ఈ యొక్క నాణ్యతలేని బిల్డింగ్ నిర్మించడం వల్ల పాఠశాల లోపల యొక్క వర్షం కారణంగా గదుల్లో పూర్తిగా చెమ ఆవరించటం వల్ల విద్యార్థులు కనీసం కూర్చోలేని దుస్థితి నెలకొంది.

ప్రతి ఏటా ఇదే దుస్థితి నెలకొంటోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ యొక్క సమస్య మరింత తీవ్రస్థాయిలో నుండుట చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వారు ఇటువంటి బిల్డింగ్స్ నిర్మాణం ఇంజినీర్ పర్యవేక్షణలో మాత్రమే నిర్మాణం గావించేటట్లు చూడాలని విద్య కమిటి చైర్మన్ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తక్షణమే బిల్డింగ్ కు మరమ్మత్తులు చేసి పిల్లల చదువులకు ఎట్టి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్