హైదరాబాద్‌లోని అరవింద్ నగర్ కాలనీలో బంగారు ఆభరణాలు తయారుచేసే రంజిత్‌గౌరాయ్ ఇంట్లో గురువారం తెల్లవారుజూమున దొంగలు పడి రెండు కిలోల బంగారు నగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బాధితుడు రంజిత్‌గౌరాయ్ వద్ద పని చేసే కార్మికుల డేటాను సేకరించారు. అలాగే బాధితుడి సోదరుడైన ఇంద్రజిత్‌గౌరాయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.