అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన విడుదలకు జాప్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉన్నారు. దీంతో మనస్థాపం చెందిన ఓ అభిమాని బన్నీని విడుదల చేయాలని కోరుతూ ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడున్న పోలీసులు సిబ్బంది సకాలంలో గమనించి అతడిపై నీళ్లు పోసి, కాపాడారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.