తమ భూముల కోసం సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ఆదివాసీలకు న్యాయం చేయాలని ఏపి రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు డిమాండ్ చేశారు. గొలుగొండ మండలంలో ఈనెల 11 నుంచి సత్యాగ్రహ దీక్ష చేస్తున్న పాత మల్లంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలను శుక్రవారం ఆయన పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల భూములపై తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ఆర్ఐ భూ మాఫియాను అరికట్టాలన్నారు. గత ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఆదివాసిలకే దక్కే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీలకు న్యాయం జరగకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామన్నారు.