కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం

63చూసినవారు
కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం
గొలుగొండ శాఖ గ్రంథాలయంలో గ్రంధాలయాధికారి రాజుబాబు ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఆదివారం విద్యార్థులచే బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ నిర్వహించారు. అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడించారు. గ్రంథాలయాధికారి రాజుబాబు మాట్లాడుతూ ఈ నెల 7న పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 22 మంది విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్