ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన స్పీకర్

65చూసినవారు
ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన స్పీకర్
విజయవాడలో వరద బాధితుల సహాయార్థం ఒక నెల జీతాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విరాళంగా ప్రకటించారు. బుధవారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విపత్తును దృష్టిలో పెట్టుకుని బుధవారం జరగాల్సిన తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్