నేషనల్ వూఘా ఛాంపియన్షిప్ పోటీలకు ఇద్దరు ఎంపిక

72చూసినవారు
నేషనల్ వూఘా ఛాంపియన్షిప్ పోటీలకు ఇద్దరు ఎంపిక
కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 11 నుంచి 14 వరకు జరుగనున్న సౌత్ జోన్ ఉమెన్ నేషనల్ వూషూ చాంపియన్షిప్ పోటీలకు నర్సీపట్నానికి చెందిన వేపాడ ప్రియాంక, ధవ్వాల మహేశ్వరి ఎంపికయ్యారు. సీనియర్ క్రీడాకారిణిగా 70 కేజీల విభాగం, సబ్ జూనియర్ క్రీడాకారిణిగా 45 కేజీల విభాగంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. మహేశ్వరి హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ విజయం సాధించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్