విశాఖ: జర్నలిస్టుల హక్కులు సాధన కోసం చలో ఢిల్లీ
జాతీయస్థాయిలో త్వరలో ఢిల్లీలో జరగనున్న జర్నలిస్ట్ ల ప్రత్యేక సమావేశానికి నగరానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొనడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, నగర అధ్యక్షులు పి నారాయణ్ లు తెలిపారు. శుక్రవారం విశాఖలోని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సమావేశమైంది. నవంబర్లో ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్( డిజేయూ )ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నామన్నారు.