నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించండి

77చూసినవారు
నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించండి
నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామంలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పిఓ అభిషేక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన త్వరితగతిన పూర్తయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్