ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది

2670చూసినవారు
ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరకు డివిజన్ పరిధిలో బాలురు, బాలికలు గురుకుల కళాశాలలు మొత్తం 8 ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో 40 సీట్లు మాత్రమే కేటాయించారు. ఏంతో మంది ఆర్థిక స్తోమత లేని గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందించే ఉచిత చదువు కోసం ధరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఐటీడీఏ, గురుకుల అధికారులు, ప్రభుత్వం వారికి మొండిచెయ్యి చూపించడం సరైంది కాదని తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ అరకు పార్లమెంట్ సభ్యులు వనుగు త్రినాధ్ సోమవారం అన్నారు. ఏపిఆర్ గురుకుల కళాశాలలు తక్కువగా ఉండటం వల్ల సీట్లు అందక చదువుకునె స్తోమత లేక విద్యార్థులు చాలా మంది ఇంటికి పరిమితం అవుతున్నారని చెప్పారు. గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రతి మండలంలో ఒక గురుకుల కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.

సంబంధిత పోస్ట్