జనసేన పార్టీ సామాన్యులకు అండగా నిలబడి వారి సమస్యలపై పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి శివశంకర్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటీ శివదత్ తో కలిసి ఆయన పర్యటించా రు. నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకార గ్రామంలో పిక్కి సత్తియ్య , లక్ష్మమ్మ దంపతుల కుటుంబా నికి చెందిన మూడు తరాలవారు సుమారు 150 మంది వివిధ పార్టీల్లో కొనసాగుతూ శివదత్ ఆద్వర్యంలో నేడు జనసేన పార్టీలో చేరారు. వీరిలో పిక్కి తాతారావు , రాంబాబు, దేవుడు , కోదండరావు , రమణ , వెంకటేష్ , గురుమూర్తులు , గోపి , రాము , కాశి , దేవరా జు, రాము, చేపల రామకృష్ణ, చోడిపల్లి గోవిందు తదితరులకు పార్టీ కండువాలు కప్పి శివశంకర్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి శివశంకర్ మాట్లాడుతూ కుల, మత, ధన రాజకీయాలకు అతీతంగా సామాన్యులకు అధి కారం సిధ్ధించాలనే సంకల్పంతోనే జనసేన ఆవి ర్భవించిందన్నారు. ఇందులొ భాగంగానే గడచిన ఎన్నికల్లో జీరో బడ్జెట్ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ నాంది పలికారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైసిపి పాలనలో దివాళా తీసిందన్నారు. నిజా యితి, నిబధ్ధత కలిగిన పవన్ కళ్యాణ్ సారధ్యం లో జనసేన అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అయితే సిఎం సిఎం అని కార్యకర్తలు ఊరకనే నినాదాలు చేస్తే పవన్ ముఖ్యమంత్రి కాలేరని, ప్రతి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధులను గెలిపి స్తేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్నా రు. ఇందుకోసం ప్రణాళికాబధ్ధంగా ముందుకు వెళుతూ ప్రజల సమస్యలపై పోరాడి వారి మన్న నలు పొందాలని శివశంకర్ కార్యకర్తలకు సూచించారు.
అనంతరం రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుధ్ధితో నెరవేరుస్తూ జనసేన బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జానకయ్యపేట ఎంపిటిసి అభ్యర్ధి కురందాసు అప్పలరాజు , బాబూరావు మాష్టారు, జార్జి , గంపల రవి , ముత్తు రమణ, శ్రీను తదితరులతోపాటు పలువురు జనసేన నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.