నక్కపల్లిలో సిఐటియు నిరసన

270చూసినవారు
నక్కపల్లిలో సిఐటియు నిరసన
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ అనుబంధ సంస్ధ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలోని మండల కేంద్రం నక్కపల్లిలో ఆటోస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలు , సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన 62 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది పార్లమెంట్ సభ్యులు రాజీనామాల ఫలితంగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ సాధించు కున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 62 గ్రామాలకు చెందిన రైతులు ప్రభుత్వానికి 22వేల ఎకరాల భూమి ఇచ్చారన్నారు. వీరందరి త్యాగాలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ పేరుతో లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్ధగావున్న స్టీల్ ప్లాంట్ ను ఇతర దేశాలకు చెందిన కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాడాలని అప్పలరాజు విజ్ఞప్తి చేసారు..

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నక్కపల్లి మండల కన్వీనర్ ఎం. రాజేష్ , స్వామి, గిరి , అప్పారావు , నాగు , నాగేశ్వరరావు , పిక్కి రమణ , సూర్యనారాయణ , అప్పారావు.
తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్