అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖజిల్లా పాయకరావుపేట సర్పంచ్ ఉషశ్రీ ప్రసాద్ నివాసంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉషశ్రీ కేక్ కట్ చేసి సీట్లు పంచారు. అనంతరం మహిళా వార్డు సభ్యులు సర్పంచ్ ఉషశ్రీని పూలబొకేలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఇందుకు ప్రతిగా పూలకుండీలు , ఇతర బహుమతులను మహిళా వార్డు సభ్యుల కు ఉషశ్రీ కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గారా ప్రసాద్ , లంకా సూరిబాబు, వార్డు సభ్యులు నారపురెడ్డి పద్మావతి, జగతా మంగాదేవి , భారతి , భీశెట్టి నూకరత్నం, దేవాదుల మంగాదేవి , ముక్కుడుపల్లి లక్ష్మి , పెదిరెడ్డి పద్మ , తాటిపాక నూక రత్నం, లావేటి కృష్ణవేణి, దాసరి శ్రీనివాస రావు, తుమ్మలపల్లి సతీష్ తోపాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.