'కాపుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన'

1241చూసినవారు
'కాపుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో కాపులకు అన్యాయం జరుగుతుందని కాపు సంక్షేమ యువసేన రాంబిల్లి మండలం అధ్యక్షులు నానేపల్లి సన్యాసిరావు అన్నారు. కాపుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం రాంబిల్లి మండలం తాహసిల్దార్ ఆఫీస్ ముందు నానేపల్లి సన్యాసిరావు అలాగే ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గం కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు కర్రీ కేశవ్, యలమంచిలి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కొటారు నరేష్ పాల్గొని వీరు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

రాంబిల్లి స్థానిక తాహసిల్దార్ భాగ్యవతి వారికి, స్థానిక ఆర్ఐ రవి వారికి రాష్ట్ర వ్యాప్తంగా కాపులు సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వినతిపత్రం ఇస్తూ కాపు సంక్షేమ యువసేన రాంబిల్లి మండలం అధ్యక్షులు నానేపల్లి సన్యాసిరావు, కాపు సంక్షేమ యువసేన యలమంచిలి నియోజవర్గం అధ్యక్షులు కర్రీ కేశవ్, కాపు సంక్షేమ యువసేన యలమంచిలి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కొటారు నరేష్ మాట్లాడుతూ కాపు నేస్తం పేరుపై 45- 60 సంవత్సరాలలోపు ఉన్న 3లక్షల కాపు మహిళలకు సంవత్సరానికి 15 వేలు చొప్పున ఈ సంవత్సరం రూ. 490 కోట్లు విడుదల చేసిందన్నారు. 2016 సంవత్సరంలో పల్స్ సర్వే ప్రకారం కాపుల సంఖ్య 27 శాతం ఉందని, అంటే సుమారు ఒక కోటి మంది కాపులు జనాభా ప్రకారం ఉందన్నారు. అందులో మహిళలు 50 లక్షల మంది ఉన్నారన్నారు.

వారిలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు మహిళలు కనీసం 20 లక్షల మంది ఉంటారన్నారు. 20 లక్షల మహిళలలో అర్హత ఉన్న వారు కేవలం 3లక్షల మంది గానే గుర్తించి వారికి కాపు నేస్తం పేరుతో సంవత్సరానికి రూ. 490 కోట్లు మాత్రమే ఇచ్చి కాపులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ఈ సంవత్సర కాలంలో రెండు వేల కోట్లు కాపు కార్పొరేషన్ ఖాతాలో జమ చేసి రూ‌. 490 ఓట్లు అదే ఖాతా నుండి ఖర్చు పెట్టినట్లు చూపించడం మోసపూరితమైన చర్య అన్నారు. కాపు నేస్తం పేరుతో అన్ని కులాలకు అదే ప్రతిపాదికన డబ్బులు పంచిపెడుతున్న ఈ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ఈ డబ్బు కాపుల బడ్జెట్ ఖాతాలో చూపించడం విడ్డూరంగా ఉందన్నారు.

కాపు నేస్తం పేరుతో కార్పొరేషన్ నుంచి వాడిన డబ్బు పోను మిగిలిన డబ్బు కార్పొరేషన్ బైలా ప్రకారం ఇతర సంక్షేమ రంగాలకు ఖర్చు పెట్టడం కాపులను దగా చేస్తుందన్నారు. కార్పొరేషన్ నిధుల నుంచి కాపు పేదలకు రుణ రూపంగా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. విద్య, ఉద్యోగుల్లో కాపు యువతకు సహకారం కొరకు గత ప్రభుత్వ కాలంలో అమలు అవుతున్న పథకాలు ఎందుకు ఈ ప్రభుత్వ కాలంలో అమలుకు నోచుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కాలర్ షిప్ లకు, ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్యలో ఇచ్చే ప్రభుత్వ సహకారాలకు, ఉపాధి రుణాలకు, ఆఖరుకు ఈ డబ్ల్యూ ఎస్ కి కేంద్రం కేటాయించిన 10 శాతం లో ఐదు శాతం కత్తెర వేస్తున్నారన్నారు. చివరకు కాపులకు ఏ విషయంలో ముద్రించారు ముఖ్యమంత్రి వారు చెబితే బాగుంటుందన్నారు.

కాపు నేస్తం బదులు 50 సంవత్సరాలు పైబడి ఉన్న పేద మహిళలందరకు వృద్ధాప్య పింఛన్ రూపంలో సౌకర్యం కలగజేసి నెలకు 3వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే అందరూ సంతోషిస్తారన్నారు. కాపు కార్పొరేషన్ నిర్దేశించిన స్కీములు ప్రకారం వివిధ పేదలకు వివిధ రంగాల్లో ఆర్థిక సాయం చేస్తూ తూ. గో అలాగే ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద అగ్రవర్ణాలకి చిన్న 10 శాతంలో 5 శాతం లేక జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కలుగజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండలం కాపు సంక్షేమ సేన సంఘం నాయకులు పప్పల నూకన్న దోర, కర్రి నాని, రామశివ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్