కొబ్బరి కాయల లోడులో నిషేధిత గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న వాహనాన్ని నక్కపల్లి పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకెళితే తూర్పుగోదావరి జిల్లా తుని వైపు నుంచి బీహార్ రాష్ట్రానికి కొబ్బరికాయల లోడులో గంజాయి తరలిస్తున్న UP 26 T 6026 నెంబర్ గల లారీ వాహనాన్ని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం జాతీయ రహదారి వేంపాడు టోల్ ప్లాజా వద్ద నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు డ్రైవర్ , క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలోని 300 ప్యాకెట్లలోవున్న 664 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నక్కపల్లి ఎస్ ఐ శివ రామకృష్ఞ తెలిపారు. గంజాయి విలువ మార్కెట్లో సుమారు 13.28 లక్షల రూపాయలు వుంటుందని ఎస్ఐ పేర్కొన్నారు.