చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్ స్థాపనకు సుముఖత తెలిపినట్లు సమాచారం. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ.. ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూనిట్ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను BYDకి ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయానికి రాగానే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.