మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు

84చూసినవారు
మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు
ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌పై కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరపగా.. తాజాగా రూ.6,000 కోట్ల బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బాఘేల్, యాప్ ప్రమోటర్లు, మరో 14 మందిని సీబీఐ FIRలో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు అగ్ర రాజకీయ నాయకులకు,అధికారులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందని సీబీఐ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్