అనకాపల్లి: కొడుకుపై గొడ్డలితో దాడి

70చూసినవారు
అనకాపల్లి: కొడుకుపై గొడ్డలితో దాడి
అనకాపల్లి మండలం గోపాలపురం పంచాయతీ పరిధిలోని వెంకటరమణపేటలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తండ్రి మొలుగు సూరి అప్పారావు, కొడుకు రాజేష్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న గొడ్డలితో రాజేవ్ తల, ఛాతిపై అతని తండ్రి వేయగా.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు రాజేష్ ను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్