ఈ నెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా శుక్రవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అధ్యక్షతన నిర్వహించి చర్చించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పీవిజీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.