రాష్ట్ర పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కార్పొరేషన్ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేయాలని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో, రాష్ట్రంలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.