ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అనకాపల్లి జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అనకాపల్లి జిల్లా లో ద్విచక్ర వాహన ప్రమాదాల కేసులు 103 నమోదు అవ్వగా, 104 మంది మృతి చెందారని, 35 మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు.