అనకాపల్లిజిల్లా మాకవరపాలెంలో రూరల్ సీఐ రేవతమ్మ మంగళవారం వారపుసంతలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ప్రతి మంగళవారం రోడ్డుపైనే సంత దుకాణాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. దీంతో ఆమె ఎస్ఐ ధనుంజయ నాయుడు, సిబ్బందితో కలిసి రోడ్డుపై దుకాణాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డుపై దుకాణాలు వాహనాలు నిలిపితే కేసులు తప్పవని హెచ్చరించారు.