నర్సీపట్నం: ఆ స్కూల్ విద్యార్థుల్లో 18 మందికి జాతీయ కరాటే పోటీల్లో పతకాలు

63చూసినవారు
నర్సీపట్నం: ఆ స్కూల్ విద్యార్థుల్లో 18 మందికి జాతీయ కరాటే పోటీల్లో పతకాలు
నర్సీపట్నం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటారు. విశాఖ పోర్టు స్టేడియంలో ఈనెల 15న జరిగిన సెంకడ్ వైజాగ్ ఓపెన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో.. 18 మంది చైతన్య స్కూల్ విద్యార్థులకు కటాస్ విభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభించాయి. విజేతలుగా నిలిచిన విద్యార్థులను, స్కూల్ కరాటే టీచర్ తరుణ్ రాజ్ ను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అభినందించారు.

సంబంధిత పోస్ట్