పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సచివాలయం వద్ద దిబ్బపాలెం, జాలారిపాలెం, సమ్మంగిపాలెం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం ఆందోళన చేశారు. మత్స్యకార నాయకులు పరదేశి, అప్పారావు, దుర్గారావు తదితరులు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. దోమలు విజృంభిస్తున్నాయని, లైట్లు వెలగడం లేదని తెలిపారు.