విశాఖ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధి బుచ్చిరాజుపాలెం గవర వీధిలో శుక్రవారం అర్ధరాత్రి పక్కపక్కన ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు విరగగొట్టి దొంగతనం చేశారు. బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో 15 తులాల బంగారం, 18 తులాల వెండి, రూ.78 వేలు దోచుకుపోయినట్లు వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు తెలిపారు.