అనంతగిరి మండలంలోని వేంగాడ పంచాయతీలోని గోమంగిపాడుకి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో డొంకపుట్టు జంక్షన్ నుండి గోమంగిపాడు వరకు ఉన్న 3 కిలోమీటర్ల మట్టిరోడ్డు బురదమయమైంది. దీనితో గోమంగిపాడు గిరిజనులు జీపుపై కించుమండ బుధవారం వారపు సంతకు వస్తుండగా జీపు బురదలో ఇరుక్కుపోయింది. అతికష్టం మీద జీపును ప్రయాణికుల సహాయంతో ముందుకు నెట్టాడడంతో కదిలింది.