గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర జీసీసీ ఛైర్మన్ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు కిడారి. శ్రావణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన అనంతగిరి మండలంలోని పెదకోట పినకోట జీనబాడు గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లోని వేసవి దృష్ట్యా తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు.