అనంతగిరి మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధి మద్దిగరులో మంచినీటి సమస్య పరిష్కరించాలని జడ్పీటీసీ గంగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మద్దిగరులో పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సమీపంలోని ఊట నీటిని తెచ్చుకొని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారని వాపోతున్నారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.