అనంతగిరి మండల కేంద్రంలో గురువారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ 2025 డైరీ, క్యాలెండర్ ను మండల ఉపాధ్యాయ శాఖ అధ్యక్షడు వంజల ఈశ్వరరావు, కార్యదర్శి నరాజి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కే బాలాజీ, గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి కూడ వెంకటరమణ, అల్లూరి జిల్లా కార్యదర్శి పుడిగి దేముడు, ఉమ్మడి జిల్లా పూర్వసహాధ్యక్షులు శెట్టి రాంబాబు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.