2025 నూతన సంవత్సర వేడుకలు నిబంధనాల ప్రకారం జరుపుకోవాలని 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని అరకు సీఐ హిమగిరి హెచ్చరించారు. లాడ్జిలు రిసార్ట్స్ బహిరంగ ప్రదేశాల్లో పోలీస్ వారి అనుమతి లేకుండా డిజె సౌండ్స్ ఫైర్ క్యాంప్ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే రేస్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.