పెంచిన విద్యుత్ సర్ చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు స్మార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహ రించుకోవాలని అధిక ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తు మంగళవారం సిపిఎం అద్వర్యంలో చీడికాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నమూనా విద్యుత్ బిల్లులను భోగి మంటలు వేసి తగలబెట్టారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు మాట్లాడుతూ ప్రజల పై బారిగ విద్యుత్ చార్జీలు పెంచి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.