ముంచంగిపుట్టు మండలంలోని దిగువకుమడలో పాఠశాల భవనం లేక విద్యార్థులకు వంట షెడ్డులోనే బోధనాలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని సంవత్సరాలుగా పాఠశాల భవనం లేక సుమారు 20 మంది విద్యార్థులకు వంట షెడ్డులోనే విద్య బోధనలు కొనసాగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం వాపోయారు. అధికారులు పాలకులు స్పందించి దిగువకుమడలో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టి విద్యార్థుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.