చాపరాయి జలవిహారికి పోటెత్తిన పర్యటకులు

84చూసినవారు
డుంబ్రిగుడ మండలంలోని పర్యటక కేంద్రమైన చాపరాయి జలవిహారికి ఆదివారం ఉదయం పర్యాటకులు పోటెత్తారు. శీతకాలం సీజన్ కొనసాగుతుండడంతో అరకులోయ డుంబ్రిగుడ అనంతగిరి మండలంలోని మన్యం అందాలను తిలకించేందుకు భారీగా పర్యటకులు తరలి వచ్చారు. పర్యాటకులు కుటుంబ సమేతంగా చిన్న పెద్దలు కలిసి చాపరాయి జలవిహారి వద్ద సరదాగా జారుతూ స్నానాలు చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. పర్యాటకులతో అరకు ఘాట్ రోడ్డు రద్దీగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్