అల్లూరి జిల్లాలో విషాదం.. విష జ్వరంతో చిన్నారి మృతి

76చూసినవారు
అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటువలస గ్రామనీకి చెందిన వంతల సోని, పుష్పకు జన్మించిన 4 నెలల చిన్నారి గురు వారం ఉదయం మృతి చెందింది. మూడురోజులు నుండి తీవ్ర విష జ్వరంతో చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించినప్పటికీ చిన్నారి దక్కకుండా పోయిదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై తెలిపారు. పండగ రోజు చిన్నారి మృతితో గేటు వలస గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్