సంక్రాంతి పండగను పురస్కరించుకుని మండలంలో ఎవరైనా కోడి పందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆనందపురం సీఐ చింతా వాసు నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం మాట్లాడుతూ. అనుమానం ఉన్న గ్రామాలలో డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అనుమతులు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని, ఇలాంటివి పూర్తిగా నిషేధించామన్నారు. ప్రజలు అందరూ పండగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.