విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఐటీ సెజ్ పరిధిలోని ఓ పార్కు వద్ద యువకుడి పై గురువారం హత్యాయత్నం జరిగింది. యువకుడి తలపై బలంగా కొట్టి పడేశారు. కొన ఊపిరితో ఉన్న యువకుడ్ని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. హత్యాయత్నానికి గల కారణాలను పోలీసులు విచారణ చేస్తున్నారు.