భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా తనను నియమించిన వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కు రుణపడి ఉంటానని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన శ్రీను) పేర్కొన్నారు. సోమవారం ఆయన భీమిలిలో మీడియాతో మాట్లాడుతూ.. తమ అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.