ఈ నెల 24 నుంచి భీమిలి నియోజకవర్గంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించనున్నట్టు వ్యవసాయాధికారిణి సంధ్యారత్నప్రభ సోమవారం తెలిపారు. మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల చొప్పున పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వచ్చిన ఆధునిక మేలైన సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయంపై సలహాలు, సూచలను ఇస్తామన్నారు.