అభివృద్ధిని, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పద్మనాభం మండలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.75లక్షల వ్యయంతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి పనులకు శనివారం రాత్రి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.