భారతీయ యువతలో నైపుణ్యాలను వెలికితీయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి జయంత్‌చౌదరి తెలిపారు. వైద్య విద్యార్థులకు నైపుణ్యాలను పెంచడానికి గీతంలో నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని, మూర్తి ప్రయోగశాలలను, మేకర్స్ స్పేస్, వెంచర్ డవలప్‌మెంట్ సెంటర్లను ఆయన మంగళవారం సందర్శించి విద్యార్ధులతో ముచ్చటించారు.