భీమిలి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనందపురం మండలం బోని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రైతు అంటే అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చనిపోయే వాడనే నానుడిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందని చెప్పారు.