చోడవరం కోర్టు న్యాయవిజ్ఞాన వేదిక మండల న్యాయ సేవాధికారి సంస్థ చోడవరం పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం బాల కార్మిక వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుంచి పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించి దుకాణాల వారికి అవగాహన కల్పించారు. 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ బి. రాజు, చోడవరం పోలీసు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.