చోడవరం మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో విఏఏ, విహెచ్ఎ, ఎంపీహెచ్ఈఓలకు జీడి మామిడి తోటలపై బీమా సౌకర్యం కల్పించేందుకు మంగళవారం అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జి.ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జీడి, మామిడి తోటలో సాగు చేసే రైతులు ఎకరాకి 1540 రూపాయలు బీమా రుసుం చెల్లించి పంటల బీమా సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈనెల 15 వరకు అవకాశం ఉంది కాబట్టి ఆసక్తిగల జీడి రైతులు సద్వినియోగపరుచుకోవాలన్నారు.