రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని శుక్రవారం చోడవరం జనసేన పార్ట్ ఇంచార్జ్ పీవీఎస్ ఎన్ రాజు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలసి విశాఖలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చోడవరం చక్కెర కర్మాగారాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చక్కెర కొనుగోలు కోసం పౌరసరఫరాల కార్పొరేషన్‌కు అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.