చోడవరం మండలం అన్నవరం వీధి నుంచి బొద్దపు స్వామి అనే వ్యక్తి శబరిమలకు సైకిల్ పై యాత్ర ప్రారంభించారు. ఈ మేరకు గురువారం తెల్లవారుజామున ఇరుముడి కట్టుకొని చోడవరం స్వయంభు వినాయకున్ని దర్శించుకుని గుడి దగ్గర నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతితో పాటు అనేక మంది స్వాములు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సైకిల్ యాత్ర దిగ్విజయం కావాలని కోరుకున్నారు.