ఆదివాసి గిరిజనులు పోరాడి సాధించుకున్న రోడ్లకు ఈనెల 13వ తేదీ నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో శంకుస్థాపన చేయాలని సిపిఎం నాయకులు కోరుతున్నారు. ఆదివారం రోలుగుంట మండలం వై బి పట్నం ఆదివాసీలు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ రోలుగుంట మండలంలో వై బి పట్నం నుండి లోసింగి మీదుగా పెద్దగోరు గ్రామానికి ఉపాధి హామీ నిధుల నుండి రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల 50 లక్షలు మంజూరు చేశారన్నారు.