ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని వడ్డాది కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు విజ్ఞప్తి చేశారు. శనివారం వడ్డాదిలో ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబుకి వారు వినతిపత్రం సమర్పించారు. 2001 నుండి ఈ వ్యవస్థ సాగుతుందన్నారు. జీవో నెంబర్ 114 ప్రకారం ఇతర శాఖల సిబ్బంది మాదిరిగా తమను కూడా క్రమబద్దీకరించాలన్నారు.