డుంబ్రిగూడ: క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

78చూసినవారు
డుంబ్రిగూడ: క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డుంబ్రిగూడ మండలం లుంగపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మంజు భార్గవి అన్నారు. గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించి, వైద్యాధికారి మాట్లాడుతూ వ్యాధి లక్షణాలను గుర్తించడం, సమర్థవంతమైన చికిత్స విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్