ఘనంగా అగ్గి పిడుగు మన్యం వీరుడు వర్ధంతి
తెల్ల దొరలకు నిద్ర లేకుండా గ డగడలాడించిన ఏకైక వ్యక్తి అగ్గి పిడుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని అల్లూరి యువజన సేవా సంఘం డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు కే. సూర్య ప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలోని అల్లూరి యువజన సేవా సంఘం మండల అధ్యక్షుడు సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో మంగళవారం అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.